తెలంగాణ

అసలు దొంగ దొరికితే.. మొత్తం బంగారం ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసులో అసలు దొంగ దొరికితేనే మొత్తం బంగారం రికవరీ అయ్యే అవకాశం ఉందని, అసలు దొంగ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏసిపి రవికుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరశివారులోని రామంచంద్రాపురంలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులు విచారణ ఎదుర్కొంటుండగా తాజాగా ముంబయి పోలీసులు మరో ఇద్దరు సురేందర్, అతని భార్య రాధారత్నంలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం వీరిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురాగా మంగళవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో సిబిఐ అధికారులమంటూ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి సుమారు ఎనిమిది కోట్ల విలువైన 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. దుండగులు కర్నాటకలోని కలబురగికి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో సుందర్, రాధారత్నాన్ని ఎట్టకేలకు అరెస్టు కాగా, అసలు దొంగ రోషన్ యాదవ్ కోసం గాలిస్తున్నారు. దోపిడీ జరిగిన 18 రోజుల్లోనే ఆరుగురు నిందితులను అరెస్టు చేసి మూడున్న కిలోల బంగారం, రూ. 5 లక్షల నగదు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో రూ. 6 లక్షలు మాత్రమే రికవరీ అయింది. మొత్తం దోపిడీకి గురైంది 41.8కిలోల బంగారం కాగా, రికవరీ అయింది కేవలం పదోవంతు మాత్రమే. ఈ కేసులో అసలు నిందితుడు పట్టుబడితే గానీ మొత్తం బంగారం బయటకు వచ్చే అవకాశం లేదు. ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన సొత్తుతోనే ఇటీవల ముంబయిలో పట్టుబడిన సుందర్, రాధ దంపతులు విహారయాత్రలకు వెళ్లారని ఏసిపి రవికుమార్ తెలిపారు. నేపాల్, గోవా, కోయంబత్తూర్‌లో గడిపి చివరకు ముంబయికి చేరుకున్న వారు పోలీసులకు చిక్కారని ఆయన వివరించారు.