తెలంగాణ

రైతుల సమస్యలు, భూ కుంభకోణాలపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: రైతుల సమస్యలు, భూకుంభకోణాలు, జోనల్ వ్యవస్థ రద్దు వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టి.టిడిపి కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ప్రసంగిస్తూ భూ కుంభకోణాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ కళ్ళు మూసుకుని పాలన చేస్తున్నదని విమర్శించారు. భూములను కాపాడడానికి టిడిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకున్నదని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టేందుకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భూ కుంభకోణాల్లో సూత్రధారులను, పాత్రధారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదని అన్నారు. టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పార్టీ జాతీయ నాయకుడు మెచ్చుకునే విధంగా తెలంగాణ మహానాడును నిర్వహించామని తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన ఖమ్మం రైతులకు బేడీలు వేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మోత్కుపల్లి నర్సింహులు ప్రసంగిస్తూ రాష్టప్రతి పదవికి దళితున్ని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.