తెలంగాణ

మొదటి వారంలో హరిత హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం నిర్వహించనున్నారు. 40 కోట్ల మొక్కలను నాటుతారు. మొక్కలు నాటేందుకు విస్తృతంగా ప్రచారం చేసేందుకు కళాకారుల బృందాలను సైతం హరిత హారంకు ఉపయోగించుకోనున్నారు. రవీంద్ర భారతిలో కళాకారులకు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 550 మంది సాంస్కృతిక సారథి కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పాటలు, ఆటల రూపంలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. మొక్కలు నాటాల్సిన అవశ్యకత వివరిస్తారు. కళతో హరిత హారాన్ని ఒక సామాజిక బాధ్యతగా జనంలోకి తీసుకు వెళతామని సాంస్కృతిక సారథి కళాకారులు ప్రతిజ్ఞ చేశారు.
ఒక్కో కళాకారుడు కనీసం వంద మంది ప్రజలను ప్రభావితం చేసి మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణ చేపట్టేలా చైతన్యం తీసుకు రావాలని వక్తలు కోరారు. అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణాగా మారాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం అని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. నేటి నుంచి గొర్రెలు తీసుకుంటున్న గొల్ల కురమలు కూడా తెలంగాణ హరిత హారంలో పాల్గొనాలని రసమయి కోరారు. హరిత హారం తెలంగాణ తల్లికి చిక్కని బొట్టు లాంటిదని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడ హరికృష్ణ అన్నారు.
అటవీ శాఖ, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిఎం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ తదితరులు హాజరయ్యారు.

చిత్రం.. మంగళవారం రవీంద్ర భారతిలో కాళాకారులకు హరితహారంపై అవగాహన కల్పిస్తున్న అటవీ శాఖ, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిఎం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్