తెలంగాణ

గౌడ నేతలపై కేసులు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జూన్ 22: క్లోరల్ హైడ్రేట్ అమ్ముతున్నారని అంటూ గౌడ సంఘం నేతలపై ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం రాత్రి తీవ్రంగా కొట్టిన నేపథ్యంలో గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట ఎక్సైజ్ కార్యాలయం ముందు రాష్ట్ర గౌడ సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వెంకటయ్య, నారాయణ, రామన్‌గౌడ్, కిరణ్‌గౌడ్, శంకర్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రామాకిష్టాపురం గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్ధుడు నారాయణగౌడ్‌తో పాటు పామాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ను, సత్యమ్మలను రాత్రివేళల్లో తీసుకువెళ్లి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా కొట్టారన్నారు. శ్రీనివాస్ గౌడ్‌కు కంటికి, చెప్పుకోలేని చోట తీవ్రంగా ఎక్సైజ్ ఇసి నవీన్ కుమార్, ఎక్సైజ్ ఎస్‌ఐలు ఖాజా మహిమూద్, గోపాల్, మహేందర్ రెడ్డి కొట్టారని, వారిని సస్పెండ్ చేయడమే కాకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు 4గంటల పాటు కార్యాలయం ముం దు ఆందోళన చేసి కార్యాలయంలోకి చోరబడేందుకు యత్నించారు. దీంతో సివిల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన గౌడ సంఘం నేతలు సిఐ కార్యాలయం వద్ద కిటికీలు, ద్విచక్ర వాహానాన్ని ధ్వంసం చేశారు. గౌడ సంఘం నేతలు వెంకటన్నగౌడ్, దేవి, శంకర్‌గౌడ్, నారాయణగౌడ్, వెంకటేష్‌గౌడ్, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
దాడి చేసిన ఎక్సైజ్ సిబ్బందిపై చర్యలు... డిసి జయసేనారెడ్డి
గౌడ సంఘం నేతలపై దాడులు చేసిన ఎక్సైజ్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయసేనారెడ్డి విలేఖరులకు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, సిబ్బంది ఏ హోదాలో ఉన్న వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. గౌడ సంఘం నేతలపై కేసులు ఎత్తి వేస్తున్నట్లు ఆయన చెప్పారు.