తెలంగాణ

నర్సక్కపేటలో జంట హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, జూన్ 22: మనిషిని మనిషిగా చూడాల్సింది పోయి మనిషి విలువలను మరిచి మనిషి మనిషికి అండగా నిలబడాల్సిన అన్న కొడుకులే రక్తసంబంధమని చూడకుండా బాబాయిల పాలిట కాలయములయ్యారు. భూ వివాదంతో రక్తసంబంధమని చూడకుండా సొంత బాబాయిలను హత్య చేసిన అన్నకొడుకుల ఉదంతం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నర్సక్కపేట గ్రామానికి చెందిన కొంకటి రాజయ్య, కొంకటి లింగయ్య, కొంకటి కనకయ్య ముగ్గురు అన్నదమ్ములు. వీరికి ఉన్న ఐదు ఎకరాలలో సాఫీగానే వ్యవసాయం చేసుకున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి వీరి మధ్య భూ వివాదం చెలరేగింది. ఈ భూ వివాదమే లింగయ్య (60), కనుకయ్య (55) ప్రాణాలు కోల్పోయేలా చేసింది. రాజయ్య కొడుకులైన అనీల్, అరుణ్ కుమార్ ఇద్దరూ కలిసి తన తండ్రికి రావాల్సిన భూమిని బాబాయిలు ఇవ్వడం లేదని లింగయ్య, కనుకయ్యలతో గొడవకు దిగారు. దీంతో వీరి మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో అనీల్, అరుణ్ కుమార్‌ఆవేశంతో గొడ్డలితో వ్యవసాయ భూమి వద్దనే బాబాయిలైన లింగ య్య, కనుకయ్యలను దారుణంగా హత్య చేశారు. ఈ త గాదాలో అడ్డుకోబోయిన వారికి స్వల్ప గాయాలు కావడం తో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ శ్రీ్ధర్, ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గ్రామస్థులను విచారించారు. మృతుల భార్యలు ఎల్లవ్వ, భారతవ్వల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పేర్కొన్నా రు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.