తెలంగాణ

ఠాణాలో యువకుడి మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జూన్ 22: చోరీకేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అయతే, అది లాకప్‌డెత్ అని ప్రచారం జరుగుతున్నా డిఎస్పీ మాత్రం అనారోగ్యంతోనే మరణించాడని వెల్లడిం చా రు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబా ద్ పోలీస్టేషన్లో చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే...బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనలో జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం జాడీమల్కాపూర్ పంచాయతీ పరిధిలోని సర్జరావుపేట తండాకు చెందిన వ్యక్తి జైపాల్ జాదల్ (29) అలియాస్ జైసింగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ నల్లమల రవి వెల్లడించారు..గత 19, 20వ తేదీల్లో పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయి. పట్టణంలోని నామ రవికుమార్‌కు చెందిన బైక్ ఇంటిముందు నుంచి చోరీకి గురైంది. దీంతో బాధితుడు పోలీస్టేషన్లో ఫిర్యా దు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు రాచన్నపేటలోని సిసి కెమెరాల్లోని ఫుటేజీలను పరిశీలించారు. బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని సర్జారావుపేటకు చెందిన జైపాల్‌గా నిర్ణయించుకుని బుధవారం గ్రామానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రెండు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీస్టేషన్‌కు తీసుకుని వచ్చిన జాదవ్‌ను పోలీసులు విచారిస్తుండగా తను జైలుకు పంపిస్తారన్న భయంతో ఒక్కసారిగా బిబి తగ్గిపోయి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే వైద్యులు డాక్టర్ శేషుబాబు పరిశీలించి ఆసుపత్రికి తీసుకుని రావాలని సూచించారు. ఆయన సూచనమేరకు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనిని పరిశీలించగా పరిస్థితి విషమిస్తుండటంతో సంగారెడ్డికి రెఫర్ చేశారు. సంగారెడ్డిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు గాంధీకి రెఫర్ చేశారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు ఇదివరకే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. పోలీసులు స్టేషన్‌కు తీసుకుని వచ్చిన అనంతరం చోటుచేసుకున్న సంఘటనలో మృతిచెందిన వ్యక్తి కావడంతో ఆర్డీఓతో అబ్దుల్ హమీద్ హైదరాబాద్‌లోని మార్చురీకి వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలి పారు. ఇదిలా ఉండగా జైపాల్‌పై బైక్ చోరీకి సం బంధించిన నాలుగు కేసుల్లో రెండుసార్లు జైలు పాలయ్యాడని డిఎస్పీ అన్నారు. జైపాల్‌ను మూడు రోజుల కిందటే అరెస్టుచేసి, చిత్రహింసలకు గురిచేయడంతో లాకప్‌డెత్‌లో చనిపోయినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. బైక్ చోరీ కేసులో అరెస్టు చేయడంతో మరోసారి జైలుకు పంపుతారన్న భయంతోనే బిబి తగ్గిపోయి మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి తారాసింగ్ ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. భార్య నిమీబాయితోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు.

చిత్రం.. జైపాల్ జాదల్