తెలంగాణ

‘బిజెపితో చీకటి ఒప్పందం కాదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23:బిజెపితో టిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం అంటూ కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపితో టిఆర్‌ఎస్‌కు చీకటి ఒప్పందం లేదని, ఉన్నదల్లా అభివృద్ధి ఒప్పందం మాత్రమేనని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్‌డిఏలో లేదు, యూపిఏలోనూ లేదనే విషయం జైపార్‌రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. టిఆర్‌ఎస్ ముస్లింల వ్యతిరేక పార్టీ అయితే ముస్లింలకు రిజర్వేషన్ల కోసం ఎందుకు పోరాడుతుందని ప్రశ్నించారు. దేశంలో నిజమైన లౌకిక వాది కెసిఆర్ అని అన్నారు. బాబ్రీ విధ్వంసం, సిక్కుల ఊచకోత జరిగింది కాంగ్రెస్ హయాంలో కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు మత కలహాల కోసం ప్రయత్నం చేశారని, ముఖ్యమంత్రిని దించడానికి సైతం మత కలహాలు రేపడం కాంగ్రెస్ సంప్రదాయం అని అన్నారు. రాష్టప్రతి అభ్యర్థిని నిర్ణయించే ముందే ఎన్‌డిఏ టిఆర్‌ఎస్ నాయకత్వాన్ని సంప్రదించిందని, కెసిఆర్ సూచన మేరకే ఎన్‌డిఏ దళిత నేతను రాష్టప్రతి అభ్యర్థిగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి అభ్యర్థిని ప్రకటించే ముందు టిఆర్‌ఎస్‌ను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. గతంలో ఎన్నికల్లో అంబేద్కర్‌ను మోసం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ను కూడా మోసం చేసిందని అన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని మీరా కుమార్ అభ్యర్థిత్వంపై ముందు నితీష్‌కుమార్‌ను జైపాల్‌రెడ్డి ఒప్పిస్తే బాగుండేదని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార విరహ వేదనతో టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఎద్దెవా చేశారు.