తెలంగాణ

సింగరేణి సమ్మెకు చెరుకు సుధాకర్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మద్దతు ప్రకటించారు. హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘం నాయకుడు రియాజ్ అహ్మద్ అధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆఫీసు ముందు జరిగిన ధర్నాలో డాక్టర్ చెరుకు సుధాకర్ పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు తెలంగాణ బతుకులంటే ముంబయి, దుబాయ్, బొగ్గు బావి అనే వారని ఆయన గుర్తు చేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బొగ్గు బావిలో పని చేస్తున్న కార్మికుల బతుకుల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.