తెలంగాణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ప్రసిద్ధ యాదగిరిగుట్ట నృసింహస్వామి దేవాలయ గర్భగుడి పనులు త్వరలో పూర్తిచేసి దసరా పర్వదినం నుంచి భక్తులకు స్వామివారి నిజదర్శనం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరంగల్ పర్యటన సందర్భంగా శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భద్రకాళి దేవాలయంలో గడచిన ఐదురోజులుగా జరుగుతున్న చండీయాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూజారుల వేతనాలు పెంచటంతోపాటు బ్యాంకు అకౌంట్ల ద్వారా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోందని అన్నారు. అందులో భాగంగా తిరుపతి తరహాలో ప్రసిద్ధ యాదగిరిగుట్ట నృసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధికి నిర్ణయించి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు.