రాష్ట్రీయం

కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 23: జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని భీమా, కృష్ణానదుల పరిసరాల ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది నుండి జారాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తోంది. భీమా నది పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షంతో ఆ నీటి వరద కృష్ణానదిలో తెలంగాణలో ప్రారంభమయ్యే తంగిడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని భీమా నది కృష్ణానదిలో కలుస్తుంది. అక్కడి నుండి వరద రావడంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులోకి దాదాపు తొమ్మిదివేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు రోజుల క్రితం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు జూరాల ప్రాజెక్టు అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. వచ్చిన నీరు కిందకు వెళ్లకుండా జూరాల నుండి కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు ఎత్తిపోసి నింపాలని అదేపనిలో ఉండాలంటూ ఎమ్మెల్యేకు సిఎం కెసిఆర్ తెలిపారు. జూరాలకు వరద నీరు వస్తున్నందున వెంటనే కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి కృష్ణాజలాలను ఎత్తిపోయాలని సూచించారు. దాంతో అధికారులు సైతం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలోని ఉంద్యాల దగ్గర గల కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ మోటారు రన్ చేసి జూరాల ప్రాజెక్టు నుండి వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. కురుమూర్తి రిజర్వాయర్ నుండి నేరుగా కాల్వల ద్వారా కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి తీలేరు మీదుగా కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. ఒక మోటారు ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతోనే కోయిల్‌సాగర్ కాల్వ నిండుగా పారుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వరద వస్తుడంటంతోనే వచ్చిన వరద నీటిని భీమా ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లతో పాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నింపడానికి అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలో గానీ జూరాల ప్రాజెక్టు చరిత్రలో గానీ ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ జరగలేదని చెప్పవచ్చు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఎనిమిది ఫీట్ల మేరకు నీటి నిల్వ ఉంది.

చిత్రం.. మహబూబ్‌నగర్ జిల్లా ఉంద్యాల దగ్గర పంప్ రన్ చేయడంతో జూరాల ప్రాజెక్టు నుండి విడుదలవుతున్న
కృష్ణా జలాలు