తెలంగాణ

సూట్‌కేస్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 26: రంజాన్ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ సూట్‌కేసు కలకలం సృష్టించింది. మసీదు సమీపంలోనే ఈ సంఘటన జరగడం మరింత ఆందోళనకు గురిచేసింది. మహబూబాబాద్ సెంటర్‌లోని తేజస్విని హోటల్‌కు సోమవారం ఉదయం ఒక అపరిచిత వ్యక్తి వచ్చి టిఫిన్ చేసి, తాను వెంట తెచ్చుకున్న లెదర్ సూట్‌కేస్‌ను హోటల్‌లోనే మరిచివెళ్లాడు. దాదాపు రెండు గంటలు గడిచినా ఆ సూట్‌కేస్ అక్కడే ఉండడంతో హోటల్ యజమానికి అనుమానం వచ్చింది. ఆ సూట్‌కేసులో ఏమైనా బాంబులు ఉన్నాయోమోనని భయపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఎస్పీ కోటిరెడ్డి స్పందించి సంఘటన స్థలానికి బాంబ్‌స్క్వాడ్‌ను పంపించారు. బాంబు స్క్వాడ్ బృందం సూట్‌కేసును తెరిచి నిశితంగా పరిశీలించారు. అయతే, సూట్‌కేసులో ఎలాంటి బాంబు లేదని తెలిసి పోలీసులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలావుండగా, ఆ సూట్‌కేసులో 2 వేల నగదు, దుస్తులు ఉన్నాయి. సూట్‌కేసులో దొరికిన ఆధారంగా ఆ సూట్‌కేసు హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ జిఎన్ రెడ్డిదిగా గుర్తించారు. ఆయన తన స్నేహితులతో కలిసి దేవాలయాలను సందర్శించేందుకు వచ్చారు. కురవి ఆలయాన్ని సందర్శించుకొని మహబూబాబాద్‌లోని హోటల్‌లో టిఫిన్ చేసి మేడారం వెళ్లే క్రమంలో తన వద్ద ఉన్న సూట్‌కేస్ అక్కడే వదిలివెళ్లడంతో ఈ హైరానా జరిగింది.

చిత్రం.. సూట్‌కేసును పరిశీలిస్తున్న బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది