తెలంగాణ

అతీగతీ లేని అంచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: కేంద్రం జాతీయ రహదారులను మంజూరు చేసినా అంచనాలు రూపొందించడానికి ఏడునెలల గడువు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగక పోవడంపై రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో ఐఆర్‌సి ప్లీనరీ సందర్భంగా నితిన్ గడ్కారి రాష్ట్రంలో ఐదు రహదారుల అభివృద్ధికి ఎనిమిదివేల కోట్ల రూపాయలతో అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే గత ఆరునెలలుగా కన్సల్టెంట్లు, అదకారులు సరైన పురోగతి సాధించలేదని మంత్రి విమర్శించారు. అంచనాలు, డిజైన్ల తయారీకి ఏడునెల వ్యవధి ఇచ్చినా ఇంకా కన్సల్టెన్సీలు తమ ప్రతిపాదనలను పూర్తి చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా వివిధ రహదారుల అభివృద్ధి కోసం భూ సేకరణ పనులు సైతం వేగవంత చేయాలని చెప్పారు. 4,647 కిలో మీటర్ల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. సంగారెడ్డి- అకోలా(140కిలో మీటర్లు) జగిత్యాల- కరీంనగర్- వరంగల్(130కి.మీ) కోదాడ- ఖమ్మం(40 కిలో మీటర్లు)సూర్యాపేట- ఖమ్మం, ఆశ్వరావుపేట (177కి.మీ) మంచిర్యాల- చంద్రపూర్(90) మొత్తం 624 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. జాతీయ రహదారులుగా వీటి అభివృద్దికి కేంద్రం ఎనిమిది వేల కోట్ల రూపాయల అనుమతులు ప్రకటించింది. అయితే అధికారులు దీనికి సంబంధించిన పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని మంత్రి విమర్శించారు. కొన్ని రహదారులకు సంబంధించి భూ సేకరణ అలైన్‌మెంట్లు నమూనాలు కూడా తయారు కాలేదని మంత్రి విమర్శించారు.