తెలంగాణ

శిరీషపై అత్యాచారం జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: బ్యూటీషియన్ శిరీష మృతిపై పోలీసులకు ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక అందింది. ఈనెల 12 శిరీష ఆత్మహత్య అత్మహత్య కేసును బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక అందుకున్న పోలీసులు శిరీషపై అత్యాచారం జరగలేదని తేలిందని గురువారం మీడియాకు తెలిపారు. శిరీష దుస్తులు, ఒంటిపై మరకల ఆధారంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఫోరెన్సిక్ పూర్తి నివేదిక వస్తే తప్ప పోలీసులు స్పష్టంగా చెప్పలేమని డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. ప్రధాన నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్‌లను కస్టడీకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా శిరీష, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల ఘటన ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా ఉన్న తేజస్విని వాంగ్మూలం కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే శిరీష బంధువులు ఆమెది ఆత్మహత్య కాదని, హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు ఆ కోణం నుంచి కూడా విచారించారు.
ప్రభాకర్‌రెడ్డి కుటుంబీకుల వినతి
ఇదిలావుండగా ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది ఆత్మహత్య కాదని, న్యాయం చేయాలంటూ ఎస్సై కుటుంబీకులు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి వేడుకొన్నారు. ఐజీ స్టేఫెన్ రవీంద్ర, ఏడీజీ గోపికృష్ణన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తప్పుడు కేసులతో తన భర్తపై నిందలు వేస్తున్నారని కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన అన్నారు. శిరీష పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టినప్పుడు ప్రభాకర్‌రెడ్డి పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని రచన తెలిపారు.
ఎస్సై ఆత్మహత్య కేసులో ఏసిపిపై ఎఫ్‌ఐఆర్
కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో గజ్వేల్ ఏసిపి గిరిధర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎస్సై ఆత్మహత్య కేసులో ఏసిపి గిరిధర్‌ను ఏ1గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు తెలిసింది. అదేవిధంగా ఏసిపి గిరిధర్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి చనిపోయిన వెంటనే ఆయన గదిలోకి వెళ్లి ఎస్సై రాసిన కొన్ని కాగితాలను ఏసిపి మాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసిపి గిరిధర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.