తెలంగాణ

కెటిపిఎస్‌లో ఉద్యోగుల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులన ప్రతులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ఇక్కడ ఉద్యోగులకు అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్లతో మాట్లాడుతూ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో చట్టపరమైన చిక్కులు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు.
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం అర్ధం చేసుకున్న విద్యుత్ రంగ సంస్ధల సిఎండిల నుండి కింది స్ధాయి యంత్రాంగం వరకు శ్రమించి పనిచేసినందునే అద్భుత ఫలితాలను విద్యుత్ రంగంలో సాధించామన్నారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలనే అసాధారణమైన నిర్ణయాన్ని ప్రకటించిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు.తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో ప్రభుత్వ లక్ష్యం మొదటి మూడేళ్లలోనే నెరవేర్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు, సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెన్యువబుల్ ఎనర్జీ అభివృద్ధి
సంస్థ చైర్మన్‌గా అబ్దుల్ అలీం
తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్ధ చైర్మన్‌గా సయ్యద్ అబ్దుల్ అలీంను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీలో మొత్తం ఎనిమిది మంది సభ్యులను నియమించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మెంబర్, డైరెక్టర్‌గా నియమించారు.