తెలంగాణ

విద్యుత్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపివార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: విద్యుత్ అవుట్ సోర్స్ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని విద్యుత్ సంస్ధల్లో పనిచేస్తున్న 23,699 మంది ఔట్ సోర్స్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు విద్యుత్ సంస్ధలు తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సంస్ధల నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎం శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్ధల తరఫున న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సేకరించి వారి అర్హతలను పరిశీలించి వారి దరఖాస్తులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నివేదిస్తున్నట్లు చెప్పారు. బోర్డు నిర్ణయం తర్వాతనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈ కేసులో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించేందుకు సంబంధించి అనుసరిస్తున్న ప్రక్రియను వివరించారు. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.