తెలంగాణ

15ఏళ్ల స్థానికతను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: జోనల్ వ్యవస్థ రద్దు కానున్న నేపథ్యంలో తెలంగాణ స్థానికులుగా పరిగణించడానికి 15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉండి ఉండాలనే నిబంధన పెట్టాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూచించారు. స్థానికతకు 15 సంవత్సరాల కాలపరిమితి నిర్ణయిస్తే తెలంగాణ వారికి న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. జోనల్ వ్యవస్థ రద్దు అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టిజిఎ) ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిజిఎ వ్యవస్థాపక చైర్మన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, పాలనా వ్యవస్థలో మూడంచల వ్యవస్థకు బదులుగా రెండంచల వ్యవస్థ తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఉద్యోగ సంఘాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయన్నారు. ఈ విధానం వల్ల గతంలో జోనల్ వ్యవస్థ కింద నియామకం జరిగిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరి సీనియారిటీకి, పదోన్నతులలో అన్యాయం జరుగకూడదని ఆయన సూచించారు. అలాగే గెజిటెడ్ అధికారులంతా స్టేట్ కేడర్‌గా, నాన్ గెజిటెడ్లను డిస్ట్రిక్ట్ కేడర్‌లుగా పరిగణించాలనే ప్రతిపాదన సరికాదని శ్రీనివాస్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. స్టేట్, డిస్ట్రిక్ట్ కేడర్లను పోస్టుల వారిగా, శాఖల వారిగా విభజన చేయాలన్నారు. స్టేట్ కేడర్‌లో విధిగా స్థానికత ఆధారంగా రిజర్వేషన్ కోటా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. టిజిఏ అధ్యక్షురాలు వి మమత మాట్లాడుతూ, రాష్టప్రతి ఉత్తర్వులను సవరించి జోనల్ విధానాన్ని రద్దు చేయనున్న క్రమంలో స్థానికులకు 85 శాతం, ఒపెన్ కేటగిరికి 15 శాతం కేటాయించాలన్నారు. తెలంగాణ స్థానికతను పరిగణనలోకి తీసుకోవడానికి ఉద్యోగుల తల్లిదండ్రులు 15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం కలిగి ఉండాలన్న నిబంధన పెట్టాలనే అభిప్రాయాన్ని అన్ని ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఈ అంశంపై ఇంకా విస్తృత చర్చ జరగాలన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుతో అమలులోకి రానున్న రెండంచల వ్యవస్థపై అధికారులు, ఉద్యోగులతో చర్చించడానికి మరింత గడువు కావాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, జూనియర్ లెక్చరర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు లాలు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న టిజిఎ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వేదికపై టిజిఎ అధ్యక్షురాలు మమత తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు