తెలంగాణ

హైదరాబాద్ ఐటి కారిడార్‌లో పెరుగుతున్న ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్ ఐటి కారిడార్‌లో రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ యేడు మే నెలాఖరు వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో 1009 రోడ్డు ప్రమాదాల జరుగగా 343 మంది మృతి చెందారు. సైబరాబాద్ పరిధిలో 269 ప్రమాదాలు జరుగగా 341 మంది మృతి చెందినట్టు ట్రాఫిక్ పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. సైబరాబాద్ ఐటి కారిడార్ పరిధిలో 2016లో 1009 ప్రమాదాలు నమోదు కాగా, 2017లోని ఐదునెలల్లో 1,478 ప్రమాదాలు జరిగాయి. కాగాట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యల ఫలితంగా గత ఐదు నెలల్లో కిందటి ఏడా ది 1,221 ప్రమాదాలు జరగ్గా 889 ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 968 ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరం 323 ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగగా, 343 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు కటింగ్‌లు, మూలమలుపుల వద్ద తగిన సూచికలు లేక అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదాలు సంభివించినట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సంవత్సరం మే మాసాంతానికి ప్రమాదాలు తగ్గాయని చెప్పవచ్చు. ఈ మొత్తం 968 ప్రమాదాల్లో 114 మోటార్ సైక్లిస్టులు, 108 పాదచారులు, 42 పైలాన్ రైడర్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మృతి చెందారు. అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో 306 మోటార్ సైక్లిస్టులు, 240 మంది పాదచారులు మృతి చెందారు. దీనిపై ట్రాఫిక్ విభాగం తీవ్రంగా పరిగణిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా స్పీడ్ లేజర్ గన్‌ల ను ప్రవేశపెట్టారు. బైక్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే స్పీడ్ లేజర్ ద్వారా కనిపెట్టి శిక్ష, జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ విభాగం పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఐటి కారిడార్‌లలో నిరంతర ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటోంది. జంట కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్: జనవరి నుం చి మే (ఐదు నెలలు) వరకు 2015లో 1031, 2016లో 103, 2017 లో 986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.