తెలంగాణ

మీరాకుమార్ పర్యటనతో లాభం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న లోక్ సభ మాజీస్పీకర్, యూపిఏ అభ్యర్థి మీరాకమార్ ఓట్ల కోసం సోమవారం హైదరాబాద్ రానున్నారు. కానీ మీరా కుమార్ రోజంతా గడిపి, జరిపే చర్చలతో సాధించేది ఏమిటీ?, ఒనగూరేంత లాభం ఎంత అని పరిశీలిస్తే కొత్తగా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ఓటర్లు లేరు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ఆమెను అభ్యర్థిగా నిలిపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో వివిధ పార్టీల బలబలాలను, ఏయే పార్టీలు ఎటువైపు ఉన్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు 13 ఓట్లు, సిపిఎంకు ఒక్క ఓటర్ ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఈ విషయంలో గుంభనంగా ఉంది. ఇంకా మద్దతుపై తేల్చలేదు. ఇక అధికార (టిఆర్‌ఎస్) పార్టీతో సహా మిగతా పార్టీలన్నీ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతుగా నిలిచాయి. కాబట్టి మీరాకుమార్ రాక వల్ల ఒరిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదనే చెప్పవచ్చు. అయితే మజ్లిస్ పార్టీ అధినేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ఆమె కలిసి చర్చలు జరిపగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ లోగడ 2010 సంవత్సరంలో బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినందు వల్ల మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు కోవింద్‌కు ఓటు వేసే అవకాశమే లేదనీ, తమ అభ్యర్థికే ఓటు వేస్తారన్న విశ్వాసంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మజ్లిస్‌తో మిత్రత్వంగా ఉంటున్న టిఆర్‌ఎస్ ఉన్నఫళంగా ఎన్డీఏకు మద్దతునివ్వడం ఆ పార్టీకి నచ్చడం లేదు. ఇక పార్టీల బలబలాల విషయానికి వస్తే ఫిరాయింపుల తర్వాత కాంగ్రెస్‌కు డజను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నందున ఆ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఎం ఎమ్మెల్యే ఒకరున్నారు. ఈ లెక్కన మీరా కుమార్‌కు ఎంపీలు కాకుండా ఎమ్మెల్యేల బలం 14 అని తేలిపోయింది.
ఇక కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందినా ఒక ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇదివరకే టిఆర్‌ఎస్‌లో చేరిపోయిన సంగతి తెలిసిందే. మరో ఎంపి నంది ఎల్లయ్య కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు అధికార టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల బలం 90 అని చెప్పవచ్చు. 15 మంది ఎంపీల బలం ఉంది. ఇంకా టిడిపికి ముగ్గురు, బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే.
ప్రణబ్ సమయంలో మాక్ పోలింగ్
లోగడ రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ పోటీ చేయించినప్పుడు ప్రచారం నిమిత్తం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జూబ్లీహాలులో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మాక్ ఓటింగ్ చేయించింది. ఇప్పుడు మాక్ పోలింగ్ చేయించే ఆలోచన ఏదీ కాంగ్రెస్ చేయలేదు.