తెలంగాణ

కోవింద్‌కు మద్దతుపై కెసిఆర్ పునరాలోచన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరా కుమార్ ఎంతో సహకరించినందున ఆమె కృతజ్ఞతాభావంగా ఓట్లు వేయాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కోరారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతునిస్తున్న టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రా వు కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాలని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో కోరా రు. ఎన్టీఏ అభ్యర్థికి మద్దతునివ్వడం వల్ల తెలంగాణ ప్రజలకు లాభం ఏమీ ఉండదని అన్నా రు. జిఎస్‌టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తున్నదని ఆయన విమర్శించారు. జిఎస్‌టికి టిఆర్‌ఎస్ మద్దతునిచ్చి, మరోవైపు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 19,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత కనిపించినప్పుడు దానిని పక్కదారి పట్టించేందుకు ఎప్పు డు ఎన్నికలు వచ్చినా టిఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని, 110 మంది ఎమ్మెల్యేలు గెలుపొందుతారని బోగస్ సర్వే విడుదల చేస్తారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాజాగా టిఆర్‌ఎస్‌కు 45 శాతం ఓట్లు వస్తాయని బోగస్ సర్వే ద్వారా విడుదల చేయించారని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.