తెలంగాణ

ఇండ్ల పోరు ఇంతింత కాదయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 2: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన 80 గజాల ఇంటి స్థలాల వివాదం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. ఇటీవలే నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఇళ్ల స్థలాలను కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారెడ్డి నేతృత్వంలో సుమారు రెండు వేల మంది వరకు ఆందోళనకు ఉపక్రమించారు. కష్టం మీద పోలీసులు ఆందోళనకారులను ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఇంటి స్థలాలకై మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి యుద్ధాన్ని ప్రకటించారు. జూన్ 30వ తేదీలోపు పట్టాలు పంపిణీ చేసిన 5500 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలను అప్పగించాలని లేనిపక్షంలో జూలై 3వ తేదీన లబ్ధిదారులతో కలిసి స్థలాలను కబ్జా చేస్తామని గడువు విధించారు. అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో లబ్ధిదారులతో కలిసి ఇంటి స్థలాల్లోకి వెళ్లడానికి జగ్గారెడ్డి వ్యూహరచనలు చేసుకున్నారు. శాంతియుతంగా నిర్వహించే తమ ఆందోళన కార్యక్రమానికి అనుమతించాలని పోలీసులకు దరఖాస్తు చేసుకోగా ఎలాంటి అనుమతీ లభించలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులను పెద్ద ఎత్తున సమకట్టుకుని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వినిపించుకునే ప్రసక్తి లేదని, అవసరమైతే లాఠీ దెబ్బలకు కూడా వెరవకూడదని జగ్గారెడ్డి కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఐబి వద్ద కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఐబి వద్దకు లబ్ధిదారులను తరలించుకురావాలని, ప్రతి కార్యకర్త ఐబికి చేరుకున్న అనంతరమే జాతీయ రహదారి గుండా సిద్దాపూర్ కాలనీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జగ్గారెడ్డి ముందస్తుగానే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. భారీ ఎత్తున పోలీసులను సదాశివపేటకు తరలించి పట్టణాన్ని దిగ్బంధం చేసారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పొజిషన్‌ను లబ్ధిదారులకు చూపించడంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీతో పాటు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘోరంగా విఫలమయ్యారని, 80 గజాల స్థలం చొప్పున తాము పట్టాలు పంపిణీ చేస్తే అనర్హుల పేరిట నిలిపివేయించారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారులకు స్థలాలను ఎందుకు చూపించలేకపోయారో జగ్గారెడ్డి సమాధానం చెప్పాలని తాజా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు జగ్గారెడ్డిని ప్రశ్నిస్తున్నాయి. కరపత్రాల ద్వారా సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై, జగ్గారెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై టిఆర్‌ఎస్ ప్రజలను చైతన్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా పరస్పరం మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తనీయకుండా పోలీసులు ముందస్తుగానే జాగ్రతలు తీసుకుంటున్నారు.