తెలంగాణ

పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణచాంద/నిర్మల్, జూలై 2: లక్ష్మణచాంద పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెంతిన ఒల్లెపు అమృత్(40) అనే వ్యక్తి ఆదివారం ఉదయం స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చి పురుగుల మందు తాగి మృతిచెందిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని రుక్మ అనే మహిళను 2001లో కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన ఒల్లెపు అమృత్‌తో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాలపాటు వీరి కాపురం సాఫీగా సాగినప్పటికీ కలతలు చోటుచేసుకున్నాయి. వీరికి నగేష్, శివప్రసాద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరునెలలుగా భార్యాభర్తల మధ్య కలతల మూలంగా రుక్మ.. అత్తింటికి వెళ్లకుండా లక్ష్మణచాందలోని తల్లితండ్రుల వద్దనే ఉంటోంది. రుక్మ కాపురానికి రాకపోవడంతో రెండు మూడుసార్లు పెద్దమనుషుల మధ్య పంచాయతీ జరిగింది. తాజాగా తన భర్త మరోపెళ్లి చేసుకున్నాడని రుక్మ లక్ష్మణచాంద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో ఎస్సై మహేంధర్‌రెడ్డి ఒల్లెపు అమృత్‌కు ఫోన్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. దీంతో ఆదివారం ఉదయం ఒల్లెపు అమృత్ తన కుమారుడు శివప్రసాద్‌ను వెంటబెట్టుకుని ఉదయం 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. రెండోపెళ్లి విషయమై అమృత్‌ను ఎస్‌ఐ అడగడం.. స్టేషన్‌లో జరిగిన పరిణామాలతో కలతచెందిన అమృత్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి తనవెంట తీసుకువచ్చిన పురుగుల మందును తాగి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అమృత్‌ను పోలీసులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
ఏరియా ఆసుపత్రి వద్ద అమృత్ కుటుంబసభ్యులతోపాటు బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళన చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలమూలంగానే అమృత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఉదయం అమృత్ ఆసుపత్రిలో చనిపోయినప్పటికీ సాయంత్రం వరకు అమృత్ కుమారుడు శివప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్నించారు. శివప్రసాద్‌ను తీసుకురావాలని కోరినప్పటికీ, పోలీసులు ప్రసాద్‌కు తండ్రి చనిపోయిన విషయం తెలుపకుండానే సాయంత్రం ఆసుపత్రికి తీసుకువచ్చి పోలీసుల ప్రమేయమేమీ లేనట్లు చెప్పించడం విడ్డూరమన్నారు. అమృత్ మృతిపట్ల తమకు అనుమానాలున్నాయని, నిజాయితీగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
పురుగుల మందు తాగే స్టేషన్‌కు వచ్చాడు: ఎస్సై మహేందర్
భార్యా భర్తల వివాదంలో భార్య రుక్మ ఫిర్యాదుమేరకు ఆమె భర్త అమృత్‌ను ఆదివారం స్టేషన్‌కు పిలిపించగా.. అమృత్ పురుగుల మందు తాగి వచ్చి పోలీస్‌స్టేషన్ ఆవరణలో అపస్మారక స్థితిలో పడిపోయాడని ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపారు. వెంటనే వైద్యం కోసం నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడని వివరించారు.