తెలంగాణ

వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం కెసిఆర్ హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జులై 2: రాష్ట్రంలో పేద వైశ్యులను ఆదుకునే క్రమంలో రూ. 1000 కోట్లతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ దామోదర్‌గుప్త పేర్కొన్నారు. ఆదివారం నాచగిరి శ్రీ లక్ష్మినృసింహ క్షేత్ర ఆవరణలో నిర్వహించిన జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. పేద వైశ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రత్యేక జిఓను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుండగా, డబల్‌బెడ్‌రూం ఇండ్లు, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ తదితర పథకాల అమలులో అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా సేవాభావం కలిగిన ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో వెనుకబడి పోతుండడం ఎంతమాత్రం తగదని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాజకీయంగా, సామాజికంగా ముందుండాలని ఆకాంక్షించారు. అయితే పేద వైశ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మరో 10 రోజుల్లో ఆయనను సంఘ ప్రముఖులతో కలవనుండగా, త్వరలోనే హైదరాబాద్‌లో వైశ్య శంఖారావం నిర్వహించి సత్తా చాటనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ పటిష్టానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు మాంచాల శ్రీనివాస్, రాష్ట్ర నేతలు గంప శ్రీనివాస్, రాజేందర్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఎన్‌సి రాజవౌళి, రత్నాకర్, బాలాజిగుప్త, మల్లికార్జున్, రాజేశ్వర్‌రావు, రాజశేఖర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.