తెలంగాణ

మిషన్ కాకతీయ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 2: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనుల్లో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందని మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వేలకోట్ల రూపాయలు ప్రచారానికి వాడుతూ అందరి దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నా ప్రయోజనం శూన్యమన్నారు. నేతి బీరకాయలో నేతి ఉందన్నది ఎంత నిజమో మిషన్ కాకతీయ పూడికలో కూడా అంతే నిజముందని విమర్శించారు. ఆదివారం స్థానిక బాలాగౌడ్ ఫంక్షన్‌హాల్‌లో విలేఖరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయలో ప్రభుత్వం చెప్తున్నదానికి, వాస్తవానికి పూడ్చలేని వ్యత్యాసం ఉందన్నారు. ప్రచారార్భాటమే తప్ప ప్రజలకు జరిగేదేమీ లేదన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాకతీయ పథకంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, సంబంధిత మంత్రి హరీష్‌రావు, అధికారులు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలన్నారు. ఎక్కడ చర్చ పెట్టినా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందన్నారు. ప్రభుత్వం చెరువులు బాగుపడ్డట్లు, వ్యవసాయం చెరువుల కిందే సాగుతున్నట్లు ప్రచారం చేస్తుందన్నారు. పనులు చేసిందేమీ లేదన్నారు. ప్రతిష్టాత్మకంగా చేప్పుకున్న మిషన్ కాకతీయలో అవినీతికి బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, బహిరంగ చర్చకు మంత్రి హరీష్‌రావు, సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. గాలివాటంగా, ఉత్తుత్తి ఆరోపణలు చేయడం లేదని, స.హ చట్టం కింద ఉన్న ఆధారాలతోనే కాకతీయ పనులపై ఆరోపణలు చేస్తున్నానని, వీటిపై కట్టుబడి ఉన్నానన్నారు. ఈ సమావేశంపై చోటామోటా లీడర్లతో కౌంటర్ ఇవ్వడం కాకుండా బహిరంగ చర్చకు సిద్ధపడితే ఆధారాలతో అవినీతిని బయటపెడుతామన్నారు. ప్రచారాలకు వేలకోట్లు ఖర్చుచేసి కానిది ఐనట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని, త్వరలోనే బండారం బయటపెడతానన్నారు. సమస్యలపై ఎవరు మాట్లాడినా టిఆర్‌ఎస్ నేతలు గొంతునొక్కే యత్నం చేస్తున్నారన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. కాకతీయపై పాజిటివ్ కథనాలు రాస్తే ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, వాస్తవాలతో కూడిన నిర్మాణాత్మక కథనాలు రాసిన జర్నలిస్టులకు అవార్డు ఇస్తామని, ఇందుకోసం పార్టీ తరపున కమిటీ వేశామన్నారు.