తెలంగాణ

అక్రమ దత్తత నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, జూలై 3: పిల్లలు లేని దంపతులు అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరమని చైల్డ్, ఉమెన్ వెల్ఫేర్ (కేంద్రీయ దత్తత రిసోర్స్ అథారిటీ) (సారా) అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఎం.రామచంద్రారెడ్డి తెలిపారు. ఒకవేళ అలా అక్రమ దత్తతను నిర్వహించిన ఇచ్చిన తల్లిదండ్రులు, పుచ్చుకున్న తల్లిదండ్రులు నేరస్థులుగా పరిగణించాల్సి ఉంటుందని, అక్రమదత్తత పిల్లలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా అధ్యక్షతన జరిగిన దత్తత-అక్రమ దత్తతపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...దత్తతను నేడు దేశవ్యాప్తంగా ఎందరో తల్లిదండ్రులకు ఊరట నిచ్చే కార్యక్రమమని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నాయన్నారు. దేశం యావత్తు ఆశ్చర్యపోయిన సంఘటన కురవిలో చోటుచేసుకుందని, ఇది మచ్చగా ఆయన అభివర్ణించారు. డాక్టర్ శ్రీనివాస్ భ్రూణహత్యలు, పిల్లల అక్రమాలతో మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలిపారన్నారు. భ్రూణహత్యలు, పిల్లల అక్రమ అమ్మకాలు చట్టరీత్యా నేరమన్నారు. శే్వత నర్సింగ్ హోం అడ్రస్ రాష్ట్రాల వ్యాప్తంగా తెలుసని, మంచి కంటే చెడు త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. దేశవ్యాప్తంగా 20 వేల మంది పిల్లల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వారి అర్హతలు, అనేక పరీక్షల తరువాత పిల్లలను అప్పగిస్తామన్నారు. పిల్లలను పోషించలేని తల్లులు వారిని అక్రమ దత్తత కాకుండా శిశుసంక్షేమ శాఖ వారు నిర్వహించే ఊయల కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.
కురవి పిల్లల సంగతేమిటి?
అవగాహన సదస్సుకు హాజరైన ప్రతిఒక్కరు వేదికను అలంకరించిన శిశుసంక్షేమ శాఖ అధికారులను, సారా అడ్వయిజరీ చైర్మన్ రామచంద్రారెడ్డిని కురవిలో అక్రమంగా డాక్టర్ నుండి తీసుకున్న పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత పదిసంవత్సరాలుగా పెంచుకున్నారు పిల్లలను వారికే అప్పగించడం వీలు అవుతుందా అని అడిగారు. వారు ఏ సమాధానం చెబుతారోనని వేచి చూసారు.
ప్రశ్నలు అడిగిన వారికి రామచంద్రారెడ్డి సవివరంగా సమాధానం ఇచ్చారు. కురవిలో ముగ్గురు పిల్లలను, వారి తల్లిదండ్రులను సిడబ్ల్యూసి వరంగల్ ముందు హాజరుపరిచిన తరువాత వారి నిర్ణయం మేరకు నడుచుకోవడం వీలు అవుతుందన్నారు.
పిల్లలను శిశుగృహాలకు తప్పనిసరిగా తరలించిన పిమ్మట ఫొటోలతో కూడిన పేపరు యాడ్ ఇస్తారన్నారు. కన్న తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రాకపోతే అప్పుడు సిడబ్ల్యూసి నిర్ణయం మేరకు ఆన్‌లైన్ దరఖాస్తు దారులకు గాని, లేదా ఇప్పుడు పెంచుకుంటున్న తల్లిదండ్రులకు గాని అప్పగించవచ్చన్నారు. కానీ 18 సంవత్సరాల వరకు సిడబ్ల్యూసి ముందు పిల్లలను హాజరుపర్చాలన్నారు.

చిత్రం.. కురవి మండల కేంద్రంలో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రీయ దత్తత రిసోర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి