తెలంగాణ

విద్యా వ్యవస్థను గాడిలో పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 1: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం వరంగల్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్ జిల్లా నుండే విద్యా మార్పులకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. విద్యాపరంగా వరంగల్ జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుతామని తెలిపారు. ఈ మేరకు డిటైల్డ్ యాక్షన్ ప్లాన్, ఎడ్యుకేషన్ సొసైటీ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని తెలిపారు. గత ఆరు నెలలుగా విద్యా విషయాలపైనే చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో విద్యార్థులకు సరైన ఫర్నిచర్ సౌకర్యం లేదని, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఎన్ని కోట్లు ఖర్చయినా మూడు నెలల్లో అన్ని పాఠశాలలకు ఫర్నిచర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ఏర్పాటు చేస్తామని, పాఠశాలల్లో కిచెన్ సౌకర్యం జూన్ 13 వరకు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవడమే ముఖ్య కారణమన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకునే విధంగా జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇంగ్లీష్ బోధన చేసే 1500 మంది టీచర్లను గుర్తించామని, ఈ విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రారంభమవుతుందన్నారు. వరంగల్ జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టవంతం చేసి ఇతర జిల్లాకు ఆదర్శంగా నిలిచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సంవత్సరం నాటికి 80 శాతం సంపూర్ణ అక్షరాస్యత సాధించే విధంగా కృషి చేస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరు వారివంతు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పిచైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి..