తెలంగాణ

సర్పంచ్ భర్తకు చెప్పుదెబ్బలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూలై 3: ఓ సర్పంచ్ భర్త తరచూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుండడాన్ని ఆమె సహించ లేకపోయింది. ఎంతోకాలం వౌనం వహించిన ఆమె చివరకు చెప్పుతో అతనిని కొట్టి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. అంతేకాకుండా ఆ వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను లైంగికంగా వేధిస్తున్నందుకు అతనిపై ఫిర్యాదు చేసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలంలోని మూలసాల గ్రామంలోని ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న పుష్పలతపై స్థానిక సర్పంచ్ భర్త, గ్రామ కారోబార్ మామిడి కొంరయ్య అసభ్యంగా ప్రవర్తించేవాడు. గత కొంతకాలంగా వేధింపులు సాగుతున్నా సోమవారం ఆమె కోపం తీవ్ర స్థాయికి చేరింది. ఇక భరించలేననుకున్న ఆమె లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కొంరయ్యను సోమవారం చెప్పుతో కొట్టింది. తన పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకే తాను ఈ దాడికి పాల్పడినట్టు గ్రామస్థులకు విలపిస్తూ తెలియజేసింది. అనంతరం పెద్దపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సర్పంచ్ భర్త కొంరయ్యపై ఫిర్యాదు చేసింది.

చిత్రం.. మామిడి కొంరయ్య