తెలంగాణ

బలహీనపడ్డ రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీరుతుపవనాలు మరింత బలహీన పడ్డాయి. జూన్ రెండోపక్షంలో నైరుతీరుతుపవనాలు బలంగా ఉండటంతో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత రెండు రోజుల నుండి రుతుపవనాలు బలహీన పడుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో అక్కడక్కడా కొద్దిపాటి వర్షాలు కురిశాయి. ఉట్నూరు (ఆదిలాబాద్) లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలలో సాధారణ వర్షాలు ఉంటాయని వెల్లడించింది.