తెలంగాణ

జిఎస్‌టిపై ఏమిటీ గందరగోళం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: జిఎస్‌టి అమలుతో లాభమా? నష్టమా? అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో చాలా గందరగోళం నెలకొన్నదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. జిఎస్‌టి అమలుతో ఖజానాకు ఏటా 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పగా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అందుకు విరుద్ధంగా 3 వేల కోట్ల రూపాయల లాభం అని అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. వీరి ప్రకటనలతో అయోమయం నెలకొన్నందున, ప్రభుత్వం స్పష్టత నిస్తూ శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిఎస్‌టితో రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లుతుందని, ఈ అంశాన్ని జిఎస్‌టి మండలిలలో కూడా ప్రశ్నించనున్నట్లు మంత్రి ఈటల చెప్పారని ఆయన గుర్తు చేశారు. వ్యాట్ రిజిస్ట్రేషన్లు, మోటారు వాహన పన్ను, ఎక్సైజ్ వంటి రాష్ట్ర పన్నుల రాబడి ప్రస్తుతం 35 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల వరకు ఉండగా అందులో 4 శాతం చొప్పున 1500 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లుతుందని ఈటల చెప్పారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.