తెలంగాణ

డ్రగ్స్ కేసులో మరో నలుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన మాదకద్రవ్యాల కేసులో మరో నలుగురు అరెస్టయ్యారు. మంగళవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నలుగురు ఎంఎన్‌సికి చెందిన ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 ప్యాకెట్ల ఎల్‌ఎస్‌డి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తాజాగా అరెస్టయిన వారిలో నిఖిల్ శెట్టి, రవి కుందన్, అమన్‌నాయుడు ఉన్నారు. వీరిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కమిషనర్ కార్యాలయంలో విచారిస్తున్నారు.
ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువుతున్న 20 పాఠశాలలకు అబ్కారి శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లేఖలు రాశారు. అదేవిధంగా డ్రగ్స్‌కు బానిసైన ఐటి ఉద్యోగులకు కూడా లేఖలు రాశారు. డ్రగ్ మాఫియా వద్ద నగరంలోని 20 పాఠశాలలకు చెందిన 1,275 మంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా డ్రగ్స్ వినియోగిస్తున్న నలుగురు సినీ నిర్మాతలను కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరి పేర్లను గోప్యంగా ఉంచామని, వీరికి కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. హైదరాబాద్‌లో కలకలం రేపుతోన్న డ్రగ్స్ రాకెట్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఎంఎన్‌సీ కంపెనీ నుంచి మరో నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఎల్‌ఎస్‌డి డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్టయ్యారు. బాధితుల్లో ఎక్కువ శాతం యువకులే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డార్క్ వెబ్‌సైట్ అనే సంస్థ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడే అవకాశం ఉందని, మరికొందరు అరెస్టయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ విలేఖరులకు తెలిపారు.
సినీ పరిశ్రమలో డ్రగ్స్
వాడకం ఉంది: పోసాని
సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేపుతోన్న నేపథ్యంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినీ రంగంలో కొందరు డ్రగ్స్ వాడడం నిజమేనన్నారు. అయితే చాలా త్కువ మందే వీటిని తీసుకుంటున్నారని, వీరి సంఖ్య కంట్లో నలుసు అంత ఉంటుందని చెప్పారు. కేవలం ఒకరిద్దరి వల్ల మొత్తం పరిశ్రమనే తప్పుపట్టడం భావ్యం కాదన్నారు. డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి వల్ల మొత్తం కుటుంబమే నాశనమవుతుందని చెప్పారు. డ్రగ్స్‌ను తాను కేవలం టివిలు, పేపర్లలో మాత్రమే చూశానని, ప్రత్యక్షంగా ఇంతవరకు చూడలేదని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప తాను రెగ్యులర్‌గా మద్యం ముట్టనని మురళీ కృష్ణ తెలిపారు.