తెలంగాణ

ఎరువులపై తగ్గిన జిఎస్‌టిపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: ఎరువులపై జిఎస్‌టిని తగ్గించిన విషయాన్ని రైతులు అందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయశాఖ కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఎరువులప 12 శాతం జిఎస్‌టి ఉండగా దానిని 5 శాతానికి తగ్గించిందన్నారు. తగ్గించిన విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల కొరత రాష్ట్రంలో ఎక్కడా తలెత్తకుండా చూడాలని, అలా ఎక్కడైనా జరిగితే దానికి అధికారులను బాధ్యులను చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. సమగ్ర రైతు సర్వేపై శుక్రవారం సాయంత్రానికల్లా అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాలన్నారు. ప్రతి జిల్లా నుంచి 100 మంది రైతులను ఎంపిక చేసి క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. పంటల బీమా పరిహారంపై ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయాలన్నారు.
పంటల బీమా ప్రిమియం చెల్లింపునకు పత్తికి ఈ నెల 15, వరికి ఆగస్టు 31, మిరప, అయిల్ ఫామ్, సోయా, కంది తదితర పంటలకు ఈ నెల 31 తుది గడువు పెట్టినట్టు కమిషనర్ పార్థసారథి చెప్పారు.