తెలంగాణ

తండ్రిని హతమార్చిన తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్/వికారాబాద్, జూలై 6: మందలించాడని కన్న తండ్రిపైనే దాడికి పాల్పడ్డాడు ఓ తనయుడు. కని..పెంచి.. పోషించిన తండ్రిని వృద్ధుడని కూడా కనికరించకుండా కత్తితో అతి దారుణంగా పొడిచి చంపిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నరుూం ఖాన్(70) ఎండు మిర్చి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. నరుూం ఖాన్ కొడుకు హాజీఖాన్ అతని భార్యకు, ఇతరుల మధ్య గురువారం గొడవ జరిగింది. గొడవ విషయమై నరుూం ఖాన్ కొడుకు, కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసి, గొడవలను ఇంటి వద్దకు తీసుకురావద్దంటూ మందలించాడు. అది మనస్సులో పెట్టుకున్న హాజీఖాన్ రావులపల్లి సంతలో మిర్చి విక్రయిస్తున్న తండ్రి నరుూంఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. నరుూంఖాన్ అక్కడికక్కడే మృతిచెందగా, మృతుని భార్య నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ దస్రునాయక్ తెలిపారు.