తెలంగాణ

రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని ప్రశంసించిన కేంద్ర అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం అద్భుతంగా ఉందని కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రసంశించారు. నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మోహిత్‌వర్మ, ప్రశాంత్ మిట్టల్, అజయ్ మోర్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్దిదారునిపై ఒక్క రూపాయి భారం వేయకుండా రెండు పడకల ఇళ్లను అన్ని వసతులతో నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర అధికారులు మాట్లాడుతూ ఈ పథకం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను కంప్యూటరీకరణ చేయడంలో తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఇళ్ల నిర్మాణ నాణ్యతపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం సూర్యాపేటలో జరుగుతున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర అధికారులు పరిశీలించేందుకు వెళుతున్నట్లు అధికారులు వెల్లడించారు.