తెలంగాణ

అనాలోచిత నిర్ణయాలతోనే టిఎస్ ఆర్టీసీకి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి నిశితంగా విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వజ్ర మినీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు యాప్ ద్వారానే టికెట్లు తీసుకోవాలనే నిబంధనతో ప్రయాణికులు బస్సు ఎక్కలేకపోతున్నారని, తద్వారా వజ్ర బస్సులతో ఆర్టీసీకి నష్టాలు పెరిగాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సిద్దిపేట డిపోలో క్యాష్‌లెస్ విధానం అమలుపరచడానికి సుమారు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి స్వైపింగ్ మిషన్లు కండక్టర్లకు ఇచ్చారని, అవి పనిచేయకుండా నిరుపయోగంగా మారాయన్నారు. సిటీ బస్సులో టివిల ఏర్పాటుకు టెండర్లు పిలిచారని, అది కార్యరూపం దాల్చలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కండక్టర్లు లేకుండా బస్సులు నడపాలని, బస్సులలో రూపే కార్డు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉపయోగించి ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించాలనే కొత్త ప్రయోగాలు చేస్తూ, సిబ్బందిని తగ్గించే చర్యలు పూనుకుంటున్న యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని రాజిరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ అనుబంధ విభాగాలైన టైర్ రిట్రేడింగ్ షాపును నష్టాల పేరుతో మూసివేయడం, తార్నాక హాస్పిటల్‌లోని ఫార్మసీ విభాగాన్ని ప్రైవేటు వారికి అప్పగించడం, కళాభవన్‌ను లీజుకు ఇవ్వడం, మియాపూర్‌లోని ప్రింటింగ్ ప్రెస్ మూసివేయాలనే నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం మానుకోవాలని సూచించారు.