తెలంగాణ

ఖరీఫ్‌లో రూ.4700 కోట్ల పంట రుణాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ఈ ఖరీఫ్ సీజన్‌లో 7.65 లక్షల మంది రైతులకు రూ.4,700 కోట్ల పంట రుణాలు పంపిణీ చేసినట్టు బ్యాంకర్లు ప్రభుత్వానికి వెల్లడించారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి పార్థసారథి అధ్యక్షతన సమావేశమైంది. ఖరీఫ్ రుణాల పంపిణీ, పంటల బీమాపై బ్యాంకర్లతో సమావేశంలో చర్చించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో మంచి వర్షాలు కురవడంతో పంట రుణాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని బ్యాంకర్లను వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశించారు. పంట రుణాల రెన్యూవల్‌తో ముడిపెట్టకుండా పంట రుణాలు మంజురు చేయాలని స్టీరింగ్ కమిటీ బ్యాంకర్లకు సూచించింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపునకు ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బిసి తేదీలను ఖరారు చేసింది. మిర్చి పంటకు ఈ నెల 9, అయిల్ ఫామ్‌కు ఈ నెల 14, పత్తికి ఈ నెల 15, వరికి ఆగస్టు 31, ఇతర పంటలకు జూలై 31 చివరి గడువుగా స్టీరింగ్ కమిటీ తేదీలు ఖరారు చేసింది. అయితే మిర్చి, పత్తి పంటల బీమా చెల్లింపునకు గడువు పెంచాలని స్టీరింగ్ కమిటీ చేసిన విజ్ఞప్తికి బ్యాంకర్లు అంగీకరించినట్టు పేర్కొన్నారు. మిర్చి పంట బీమా చెల్లింపునకు ఈ నెల 15 వరకు, పత్తి పంటకు ఈ నెల 31 వరకు గడువు పెంచాలని స్టీరింగ్ కమిటీ తాజాగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు.