తెలంగాణ

ఐటి హబ్ నుంచి డ్రగ్స్ హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ఒకప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షించి ఐటి హబ్‌గా పేరొందిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్రగ్స్ హబ్‌కు దిగజార్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని టిటిడిపి నేత, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, ఐటి హబ్‌గా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు స్ధావరంగా మారిందని ఆరోపించారు.
హైదరాబాద్ సంస్కృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి చెందే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మొదలుకుని స్కూల్ పిల్లల వరకు డ్రగ్స్ మాఫియా పని చేస్తోందంటే హైదరాబాద్ ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో స్పష్టమవుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
డ్రగ్స్ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారిస్తుంటే డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం చూశామని, పోలీసు వ్యవస్థను పక్కదారి పట్టించకుండా, ఇప్పటికైనా సమస్య మూలాల్లోకి వెళ్ళి దృష్టి పెట్టాలని అన్నారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.