తెలంగాణ

విద్యకు,ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: కేంద్రప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం వెల్‌నెస్ సెంటర్ -5 పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విద్య, ఆరోగ్యవిభాగాలకు 120 కోట్ల రూపాయిలను కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. వరంగల్‌లోని కెఎంసికి 72 కోట్లు, ఆదిలాబాద్‌లోని ఆర్‌ఐఎంఎస్‌కు 72 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత వైద్య శాస్త్ర విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదను కేంద్రం ఆమోదించిందని అన్నారు. వైద్యుల కొరతను , అనుభవజ్ఞులైన ప్రభుత్వ వైద్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వైద్యుల పదవీ కాలాన్ని మూడేళ్ల పాటు పెంచారని అన్నారు. హైదరాబాద్ నగరంలో 1.5 లక్షల మంది సిజిహెచ్‌ఎస్ కింద లబ్ది పొందుతున్నారని చెప్పారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ