తెలంగాణ

ఇసెట్ ద్వారా 12,234 సీట్ల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: తెలంగాణ రాష్ట్రంలో ఇ సెట్ ద్వారా 12,234 మందికి సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. ఇసెట్‌లో 22,702 మంది అర్హత సాధించగా, 15,644 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారని, 14,496 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేశారని, అందులో 12,234 మందికి సీట్లు కేటాయించగా ఇంకా 7767 సీట్లు మిగిలే ఉన్నాయని చెప్పారు.
ఇంజనీరింగ్‌లో 10 యూనివర్శిటీ కాలేజీల్లో 264 మందికి, 188 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 11,910 మందికి సీట్లు లభించాయని అన్నారు. 3 ప్రభుత్వ ఫార్మసీ కాలేజీల్లో 16 సీట్లు, 115 ప్రైవేటు ఫార్మసీ కాలేజీల్లో 825 సీట్లు భర్తీ చేసినట్టు చెప్పారు. అభ్యర్ధులు తమ ఫీజును 14వ తేదీలోగా చెల్లించాలని, కాలేజీలకు 14వ తేదీలోగా రిపోర్టు చేయాలని ఆమె వివరించారు.
ఐసెట్‌కు 13,353 మంది హాజరు
ఐసెట్ సర్ట్ఫికేట్ల పరిశీలనకు 28వేల మంది అభ్యర్ధులను ఆహ్వానించగా అందులో 13,353 మంది హాజరయ్యారని కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ చెప్పారు. అందులో ఒయు నుండి 12,968 మంది, ఎయు నుండి 198 మంది, ఎస్వీయు నుండి 99 మంది , ఇతర రాష్ట్రాల నుండి 88 మంది హాజరయ్యారని అన్నారు.
ఎమ్సెట్ ఫీజు చెల్లింపునకు గడువు
ఎమ్సెట్‌లో సీట్లు పొందిన వారు తమ ఫీజును చెల్లించేందుకు ఈ నెల 11వ తేదీ వరకూ గడువు విధించినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. కాలేజీలకు అభ్యర్ధులు 12వ తేదీలోగా రిపోర్టు చేయాలని చెప్పారు.