తెలంగాణ

నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: నిరుద్యోగులకు తీపి కబురు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 1506, పంచాయతీరాజ్ శాఖలో 359 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. పత్యక్ష నియామక పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి)కి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 1506 పోస్టుల్లో 700 విఆర్‌ఓ, 400 జూనియర్ అసిస్టెంట్/ టైపిస్ట్, 210 డిప్యూటీ సర్వేయర్లు, 50 జూనియర్ అసిస్టెంట్, 50 కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి అనుమతించింది. పంచాయతీరాజ్ శాఖలో 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 277, అసిస్టెంట్ ఇంజినీర్ 82 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ నీటిసరఫరా, శానిటేషన్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.