తెలంగాణ

లోక్ అదాలత్‌లో 29,510 కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్‌లో 29,510 కేసులను పరిష్కరించామని అధికారికంగా ప్రకటించారు. లోక్‌అదాలత్‌కు సంబంధించిన వివరాలను ఈ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి.ఆర్. మధుసూదన్‌రావు శనివారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. అథారిటీ ప్యాట్రన్- ఇన్-చీఫ్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నాయకత్వంలో లోక్ అదాలత్ కేసుల పరిశీలన జరుగుతోందని వివరించారు. పరిష్కరించిన కేసుల్లో 18,673 ప్రీలిటిగేషన్ కేసులు, 10,837 కోర్టుల్లో పెండింగ్ కేసులని మధుసూదన్‌రావు వివరించారు. 28.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించామని వెల్లడించారు.