తెలంగాణ

ప్రకృతి వైద్యానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: ప్రకృతి వైద్యానికి తమ (తెలంగాణ) ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో అత్యాధునిక వసతులతో ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రకృతి చికిత్సా విధానాలను పరిశీలించేందుకు ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎ. రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర వైద్య సేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్‌రావు తదితర ఉన్నతాధికారులతో కూడిన బృందంతో మంత్రి బెంగుళూరు వెళ్లారు. బెంగుళూరులోని సౌఖ్య, జిందాల్ ప్రకృతి చికిత్సా కేంద్రాలను శనివారం పరిశీలించారు. వివిధ విభాగాల్లో వేర్వేరు రోగాలకు అందిస్తున్న చికిత్సలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోగ నివారణకు ప్రకృతి చికిత్సను మించిన వైద్యం లేదన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ చికిత్సలో లేకపోవడం గమనార్హమన్నారు. కర్నాటక కన్నా మెరుగైన ప్రకృతి వైద్య చికిత్సను తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి తెస్తామని వెల్లడించారు. అనంతగిరిలో ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ (బేగంపేట) లోని ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

చిత్రం.. బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని సందర్శిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి బృందం