తెలంగాణ

భూ కుంభకోణాలు.. ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: భూ కుంభకోణాలు కలిగిస్తున్న భూ ప్రకంపనలతో రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగానే మరో విడత సమగ్రంగా పరిశీలన (రీ-సర్వే) చేయాలన్న పట్టుదలతో ఉంది. ఏడాదిన్నరలోగా సమగ్రంగా రీ-సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. జిల్లాల పునర్విభజన జరగక ముందు ఉన్న తెలంగాణలోని 10 జిల్లాల్లో హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా మిగతా వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి మొత్తం 254 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో 139 కోట్లు కోట్లు కేంద్రం విడుదల చేస్తుంది. మిగతా 115 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని భూమి ఎంత?, అటవీ భూమి ఎంత?, అన్యాక్రాంతమైన భూమి ఎంత? తదితర కోణాల్లో పరిశీలన చేసి నివేదిక సమర్పించాల్సిందిగా తాజాగా సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ (ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్) శాఖను ఆదేశించింది. వర్షాకాలం ముగిసిన తర్వాతే రీ-సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సర్వే పూర్తయితే పట్టా భూములు, ఇతరత్రా భూములన్నింటిపై స్పష్టత వస్తుంది. అనేక చోట్ల రికార్డులు తారు-మారు అయ్యాయన్న అభియోగాలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో మ్యాపులు, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్కు (ఎఫ్‌ఎంబి)లు పరిగణలోకి తీసుకుని ఒరిజనల్ పేరేంట్ రికార్డులను పరిశీలన చేయాల్సి ఉంటుంది. భూ వివాదాలకు ‘తెర’ దించేందుకు ఉన్న భూములన్నీ డిజిటలైజేషన్ చేయాలని అధికారులు చాలా కాలంగా చెబుతున్నారు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ, అటవీ భూములన్నింటిపై స్పష్టత వస్తుంది. భూ వివాదాలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అంటే రాష్ట్రం విడిపోవడానికి ముందు పదేళ్ళ క్రితం సర్వే చేయించాలని భావించింది. 85 సంవత్సరాల క్రితం నాటి రికార్డుల పరిశీలించి జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి)ను చేయాలనుకుంది. ఇలాఉండగా 2014లో ఎన్నికలు జరిగి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2015లో ‘ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి’ పేరును ‘ఈ-్ధర్తీ’గా మార్చింది. భూముల రికార్డులను అత్యాధునిక పద్ధతుల్లో డిజిటైజేషన్ చేయాలని, సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2008 సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ పైలట్ ప్రాజెక్టుగా 2008లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించింది. అప్పుడు భూ-్భరతి పేరిట సర్వే నిర్వహించడమైంది. ఆ తర్వాత కరీంనగర్, శ్రీకాకుళం, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల చేపట్టలేకపోయింది. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే నిమిత్తం నిధులు విడుదల చేయలేదని తెలుస్తోంది. ఇలాఉండగా రెండేళ్ళ క్రితం కేంద్రం 83 కోట్ల రూపాయలను ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి కింద విడుదల చేసింది. ఇలాఉండగా ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ శాఖ పరిపాలనాపరమైన అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.