తెలంగాణ

మజ్లిస్‌కు అంతుచిక్కని సిఎంకెసిఆర్ మర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతునివ్వడం మిత్రపక్షమైన మజ్లిస్‌కు మింగుడుపడడం లేదు. ఉన్నఫళంగా ఎన్డీఏ వైపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొగ్గు చూపడం వెనుక మర్మం, ఆంతర్యం ఏమిటో మజ్లిస్‌కు అంతుచిక్కడం లేదు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే కాంగ్రెస్‌కు దూరమైనందున, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరాకుమార్‌కూ మద్దతునివ్వలేరు. ఓటింగ్‌కూ దూరంగా ఉండలేరు. కాగా కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో ఉంటేనైనా రాష్ట్రానికి నాలుగు మంచి పనులు, పథకాలూ సాధించుకోవచ్చన్నది కెసిఆర్ ఎత్తుగడ. కాగా మిత్రపక్షమైన మజ్లిస్‌కు కోపం వస్తుందని ఆయన ఊహించి ఉండరా? అంటే తప్పకుండా ఆలోచించే ఉంటారు. దేనికదే అనే భావనతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటారు. మిత్రపక్షమైన టిఆర్‌ఎస్ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదని, పైగా తమను నామమాత్రంగానైనా ఒక మాట అడగలేదన్న అసంతృప్తి మజ్లిస్ నేతల్లో కనిపిస్తున్నది. దీంతో మజ్లిస్‌కు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. టిఆర్‌ఎస్ బాటలో నడవలేదు. ఇదివరకే విడాకులు తీసుకున్న యుపిఎ వైపూ వెళ్ళలేదు. పోనీ తటస్థంగా ఉందామా? అంటే అదీ విమర్శలకూ దారి తీసేలా ఉంది. తటస్థంగా ఉంటే పరోక్షంగా ఎన్డీఏ అభ్యర్థిగా మద్దతునిచ్చినట్లే అవుతుందన్న వాదన లేకపోలేదు. బిజెపి అందునా సంఘ్ పరివార్ వ్యక్తిగా రామ్‌నాథ్ కోవింద్‌కు ముద్ర ఉంది. కాబట్టి కోవింద్‌కు మద్దతునివ్వలేరు. తటస్థంగా ఉండడం కంటే యుపిఎ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా కోవింద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. యుపిఎ అభ్యర్థికి ఓటు వేస్తే ఇటు కెసిఆర్‌కూ నచ్చదేమో!. ఇటువంటి ఎనె్నన్నో ప్రశ్నలు, అనుమానాలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. గోరక్షక దళాల దాడుల గురించి బహిరంగంగా విమర్శిస్తున్న మజ్లిస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ రాష్టప్రతి ఎన్నికల విషయంలో మాట్లాడడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునివ్వడంలో పరమార్థం ఉందని, ఇడి కేసులో కొంత ఊరట లభిస్తుందనేది వ్యూహమై ఉంటుందని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతున్నది. కానీ మజ్లిస్ మాత్రం తమ కార్యకర్తలకు ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని తెలుస్తోంది.