తెలంగాణ

జాతీయ స్థాయిలో కొత్త పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: ముస్లిం మైనారిటీ యువతుల వివాహ సమయంలో ఆర్ధిక సాయం అందించేందుకు ఒక పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలుచేయనున్నట్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో శనివారం నాడు జరిగిన ఎస్‌సిఎ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాభివృద్ధికి మైనారిటీ శాఖ స్కాలర్‌షిప్ పొందిన యువతులకు వివాహం కోసం 51వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకానికి తెలంగాణలో అమలు జరుగుతున్న ‘షాదీ ముబారక్’ తరహాలో నామకరణం చేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల మైనారిటీ బాలికల విద్యకు, యువతుల వివాహానికి పెద్ద ఎత్తున సాయం అందించినట్టు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ పథకం విజయవంతంగా అమలు అవుతోందని, కాని దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీలు ఇబ్బంది పడుతున్నారని వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. బాలికల చదువు కోసం ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందించినా, మరింకొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని దానివల్ల యువతుల వివాహానికి డబ్బు దాయలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక సాయం వల్ల బాలికల డ్రాపవుట్లను నిరోధించడంతో పాటు ఉన్నత చదువుకు, వివాహానికి కేంద్రం అండగా ఉంటుందని పేర్కొన్నారు. గరీబ్ నవాజ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు 100 జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని, దీంట్లో విద్యావంతులకు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో సర్ట్ఫికేట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తామని చెప్పారు. తాజాగా జిఎస్‌టిపై కూడా సర్ట్ఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తామని, దీనివల్ల మూడు నెలల తర్వాత వారు సొంత కాళ్లపై నిలబడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎంసిహెచ్‌ఆర్‌డిలో శనివారం జరిగిన ఎస్‌సిఎ వార్షిక సదస్సు వేదికపై ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలతో ముచ్చటిస్తున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ