తెలంగాణ

నేడు సికిందరాబాద్ బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: ఆషాఢ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునే బోనాల పండుగలో భాగంగా ఆదివారం సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతరకు జరగనుంది. సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న రంగంతో రెండురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పండుగలో మహిళలు, యువతులు పాల్గొనే అవకాశమున్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఆదివారం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రత్యేకంగా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. నగరం, శివారులోని వివిధ ప్రాంతాల నుంచే గాక, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానం పంపారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు గాను సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా మద్యం షాపుల మూసివేశారు. అలాగే పరిసర ప్రాంతాలైన బాటా, ప్యాట్నీ చౌరస్తా, రాంగోపాల్‌పేట, బోట్స్‌క్లబ్ చౌరస్తాల వద్ద ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయటంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.