తెలంగాణ

ఇక సర్కార్ భూములకు జియో ఫెన్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా డిజిటల్ టెక్నాలజీతో జియో ట్యాగింగ్ చేసే పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి భూ పరిపాలన శాఖ, రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో చెరువు లు ఆక్రమణకు గురికాకుండా జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. వచ్చే బడ్జెట్‌లో అన్ని రకాల ప్రభు త్వ భూములు కబ్జాకు గురి కాకుండా జియో ఫెన్సింగ్ చేసేందుకు నిధులను కేటాయించనున్నారు. ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూములను ముందుగా రెవెన్యూ శాఖ గుర్తిస్తుంది. సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల మధ్య ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా చూసే వ్యవస్ధ లేదు. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏ భూమి రిజిస్టరైనా వెంటనే డాక్యుమెంట్లు ఇవ్వకుండా రెవెన్యూ కార్యాలయంలో ఈ భూములు వివాదం లేనివని గుర్తించిన తర్వాత డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు ఇచ్చే పద్ధతిని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ భూములను గుర్తించేందుకు రెవెన్యూ, మండలాల వారీగా అధికారుల కమిటీని ఆర్‌డివో స్ధాయిలో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తిస్తారు. ఈ నివేదిక వచ్చిన వెంటనే ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములపై వచ్చే నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని రెవెన్యూ డివిజనల్ స్ధాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభు త్వ భూముల చుట్టూ జియో ఫెన్సింగ్ చేసిన తర్వాత అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడతారు. ప్రభుత్వ భూముల రికార్డులను డిజిటలైజేషన్ చేస్తే ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినా, అక్కడ కంప్యూటర్లు నమోదుకు అనుమతించవు. దీనికి సంబంధించి ప్రభుత్వ భూములకు కొత్త సర్వే నంబర్లను ఇవ్వనున్నారు.
ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్‌ను రూపొందిస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్(పివోబి)ని రూపొందిస్తున్నాయి. నిషేధిత భూముల లెక్కలు తేలితే కబ్జాలను నిరోధించవచ్చని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఈ భూముల జాబితాను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌లోకి కొన్ని ప్రైవేట్ పట్టా భూములు, కొన్ని నిషేధితభూములు ఉన్నాయి. ఈ సర్వే నంబర్లను వేరు చేయనందు వల్ల ప్రైవేట్ భూముల బదలాయింపుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. పైగా ఈ ముసుగులో ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఈ అంశం న్యాయ పరిధిలో ఉంది. ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్‌ను వెంటనే రూపొందించాలని న్యాయస్ధానం గత ఏడాది ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాని అనేక కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 22(ఏ) సెక్షన్ కింద రకరకాల భూముల బదలాయింపును నిషేధించారు. ఇం దులో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వా లు, దేవాదాయ, వక్ఫ్ భూములు, కోర్టులు, రెవెన్యూ శాఖకు అటాచ్ చేసిన భూములు, పన్నుల శాఖకు అటాచ్ అయిన భూములు ఉన్నాయి. నిషేధిత భూముల జాబితా తయారైన వెంటనే ప్రభుత్వం నోటిఫై చేయనుంది.