తెలంగాణ

హైదరాబాద్‌లో విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: హైదరాబాద్‌లో డ్రగ్ కల్చర్ విస్తరిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్ ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. డ్రగ్స్ రాకెట్‌లో బయటకు వస్తున్న కొత్త అంశాలు మహానగరాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు, ఐటి కంపెనీ ఉద్యోగులు డ్రగ్స్ బాధితులు అయ్యారన్న వార్త అందరినీ వణికిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో డ్రగ్ కల్చర్ ఇంతలా విస్తరించడానికి కారణాలేమిటి? ఎవరికీ చిక్కకుండా డ్రగ్స్ ఎలా తరలిస్తున్నారు? ఎగుమతి, దిగుమతులు ఎలా జరుగుతున్నాయి? ఎలాంటి పకడ్బంది వ్యూహం అమలు చేస్తున్నారు? ఒకరినొకరికి సంబంధం లేకుండా డ్రగ్ మాఫియా ఎలా జాగ్రత్త పడుతుంది? మొత్తంగా దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అనే అంశాలు పోలీసులను, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ రాకెట్‌లో ఇప్పటి వరకు మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరిని రిమాండ్‌కు తరలించగా, మరికొందరిని విచారిస్తున్నారు. అయితే వీరిలో ఎవరికి ఇంకొకరితో సంబంధాలు లేవని, ఎవరికి వారు తమ టార్గెట్‌ను పూర్తి చేసుకుని వెళ్లేలా డ్రగ్ మాఫియా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్‌పై డ్రగ్స్ మాఫియా ఎప్పుడో కనే్నసింది. దేశంలోని మహానగరాల్లో హైదరాబాద్‌లోనే డ్రగ్స్ కల్చర్ వేంగంగా విస్తరిస్తున్నట్టు ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. కాకపోతే ఇప్పుడు వారి వ్యాపారాన్ని కళాశాలలతోపాటు పాఠశాల స్థాయి వరకు విస్తరింపజేశారు. బార్‌లు, పబ్‌లు, రెస్టారెంట్లు, ఐటి ఉద్యోగుల కంటే, పిల్లల్ని సులభంగా డ్రగ్‌కు అలవాటు చేయవచ్చని డ్రగ్ మాఫియా ముఠాలు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నాయి. డ్రగ్ మాఫియా కేసులో తీగ లాగినా కొద్దీ.. మాఫియా డొంక కదులుతోంది. ఇప్పటికే ఆరు ముఠాలుగా ఏర్పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్న 14మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 16 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వెబ్‌సైటల్లను కూడా అధికారులు గుర్తించారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై డ్రగ్స్ సరఫరా చేస్తున్న దీపక్, అబ్దుల్‌లన సిట్ అధకారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 డోసుల ఎల్‌ఎస్‌డీ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ ముఠాలు డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న 16మందిని సిట్ విచారిస్తోంది. మరో 12 ముఠాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు డ్రగ్ మాఫియాకు చెందిన కెల్విన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే కెల్విన్‌కు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు దిగుమతి అయ్యే డ్రగ్స్ గోవా నుంచి సరఫరా అవుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కెల్విన్, నిఖిల్ శెట్టితో గోవా నుంచి డ్రగ్స్ తెప్పించేవాడని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు, హోటళ్లకు, సినీ నిర్మాతలకు ఒక్కొక్కరికి ఒక్కో డిస్ట్రిబ్యూటర్‌ను ఏర్పాటు చేసుకొని సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా భారీ స్థాయిలోనే జరుగుతోందని సిట్ గుర్తించింది. ఈ కేసులో కీలక సూత్రధారి కెల్విన్ కస్టడీకి సిట్ కోరనున్నట్టు తెలిసింది. కాగా కెల్విన్‌కు అంతర్జాతీయ ముఠాతో డ్రగ్ లింక్ ఉండడంతో సిట్ నార్కోటిక్ సెల్‌కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.