తెలంగాణ

కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని కాంగ్రెస్ నేతల వాదన తప్పని నిరూపించడమే కాకుండా మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి అడుగడుగున అడ్డుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో పల్లారాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అయితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవన్న దుర్భుద్దితో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6000 మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తి తమ ప్రభుత్వ హయాంలో కేవలం మూడేళ్లలో రెట్టింపుగా 12000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యానికి తీసుకెళ్లిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద కనీసం ఒక్క మెగావాట్ ఉత్పత్తి జరుగలేదన్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక రూ.563 కోట్లు ఖర్చు చేసి అక్కడ త్వరలోనే 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధం చేసిందన్నారు. థర్మల్, హైడల్, సోలార్ తదితర మార్గాల ద్వారా 28000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తుందన్నారు. కోతలు లేని విద్యుత్‌తో రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవనే అక్కసుతోనే ఆ పార్టీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు.