తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జులై 9: మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరు కొంటామనుకొనే లోగా... ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది... ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మెట్లకుంట చెక్‌పోష్టుకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో మహిళ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెం దింది. మృతి చెందిన వారిలో పరిగి మండలం యావోజిగూడెం గ్రామానికి చెందిన కంకరి చంద్రయ్య (70), శంకర్ (40) కుల్కచెర్ల మండలం అంతారం పరిధిలోని బిందెగడ్డతండాకు చెందినవాడిగా గుర్తించారు. మృతి చెందిన మరో మహిళ నిరంజని (45) హైదరాబాద్‌వాసిగా గుర్తించారు. తుఫాన్ వాహనం ఎపి 29 వి 2843లో 12 మంది ప్రయాణికులు కొడంగల్ నుండి పరిగికి వెళ్తున్నారు. మెట్లకుంట చెక్‌పోస్టు దాటిన తర్వాత శంకర్‌గౌడ్ తోట సమీపంలో ఆగి ఉన్న లారీ ఎపి 28 టిబి 9101 ని వెనుక వైపు నుండి ఢీకొట్టింది. శంకర్ మృతదేహం లారీ , తుఫాన్‌ల మధ్యలో ఇరుక్కుపోయింది. చంద్ర య్య వాహనం వెనుక సీట్లోనే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న నిరంజనిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది. కాగా, తుఫాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు బిందెగడ్డ తండాకు చెందిన వారుగా గుర్తించారు. వారిలో శంకర్ మృతి చెందగా మిగతా నలుగురు ప్రాణాలతో బయ ట పడ్డారు. రోడ్డు ప్రమాదం కారణంగా హైదరాబాద్ - బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారికిరువైపులా వాహనాలు బారులు తీరా యి. బొం రాస్‌పేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కొడంగల్ ఎస్‌ఐ దస్రు నాయక్‌లు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.