తెలంగాణ

టిఎస్‌ఆర్టీసీకి జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: అత్యుత్తమ సంస్థగా టిఎస్‌ఆర్టీసీ 2017కు గానూ మూడు ప్రతిష్టాత్మక ఇండియా బస్ జాతీయ అవార్డులు పొం దింది. ఈ మేరకు ఆదివారం అవార్డు గ్రహీతలు రాష్ట్ర మంత్రులు కేటిఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికుల నుంచి వారివారి బస్ ప్రయాణములోని అనుభవాలను, ఇబ్బందులను తెలుసుకుని సర్వీసుల నాణ్యతను మెరుగుపరచేందుకు ఏర్పాటు చేసిన కాల్‌సెంట్ వ్యవస్థకు 3ఎక్సల్లెన్స్ ఇన్ బస్ ట్రాన్స్‌పోర్టు2 అవార్డు, మెడికల్ ఆన్ ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు ఆసరా కల్పించేందుకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు ఏర్పా టు చేసిన పథకానికి 3ఎక్సల్లెన్స్ ఇన్ ఎంప్లా రుూ వెల్ఫేర్2 అవార్డు, ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా అత్యధిక కాలంగా (33సంవత్సరాల పాటు) బస్సు నడపినందుకు 3టాప్ బస్‌డ్రైవర్2(మహమ్మద్ రఫీ, భైంసా డిపో) అవార్డులు లభించాయి. ఆదివారం నగరంలోని ఐటిసి కాకతీయ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునిల్ శర్మ, టిఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నాగరాజు. డి వేణు అందుకున్నారు. వారితోపాటు సంస్థ అధికారులు చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రవీందర్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్ సుదర్శన్, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ సిహెచ్ వెంక న్న తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఐటిసి కాకతీయ హోటల్‌లో రాష్ట్ర మంత్రులు కేటిఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా
అవార్డులు అందుకున్న టిఎస్‌ఆర్టీసీ సిబ్బంది