తెలంగాణ

ఒకే రోజు రెండు పరీక్షలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), వెటర్నరీ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఈ నెల 23న ఒకే రోజున పరీక్ష నిర్వహించడం భావ్యం కాదని టి.పిసిసికి అనుబంధ విభాగమైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మందడి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్‌ను సోమవారం అనిల్ కుమార్ యాదవ్ కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ రెండు పరీక్షలు ఒకే రోజున ఉండడం వల్ల అభ్యర్థులు రెండింటికీ హాజరుకావడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ రెండు ఉద్యోగాలకు వందల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు ఆయన చెప్పారు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని రెండు పరీక్షలు వేర్వేరు తేదీల్లో నిర్వహించాలని ఆయన కోరారు.